న్యాయసేవలకమిటీ తణుకు ద్వారా ఉచిత న్యాయసహాయం

తణుకు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి.వి.ఎన్. రంజిత్ కుమార్ సబ్ జైల్ ను సందర్శించి అందులో వున్న రిమాండ్ ముద్దాయిలకు అందుచున్నా ఆహార వసతి వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేకపోతే వారికి మండల న్యాయసేవల కమిటీ తణుకు వారి ద్వారా ఉచిత న్యాయసహాయం సేవలు అందిస్తారని అలాగే ప్రతి ఒక్కరూ న్యాయవాదిని కలిగి ఉండాలని తెలిపారు. వారంలో రెండురోజులు జైలులో వున్న క్లినిక్ కు ప్యానెల్ న్యాయవాది, పారాలీగల్ వాలంటీర్ లు ముద్దాయిలకు వారి కేసులలో న్యాయ సలహాలు, మరియు సమస్యలు ఉంటే వారికి సలహా ఇస్తారని, బెయిల్ అయ్యి సురీటీలు పెట్టుకునే స్తోమత లేని ముద్దాయిలకు GO 198 ప్రకారం poor prisoner ల క్రింద జిల్లా న్యాయ సేవాధికర సంస్థ ఏలూరు వారి కమిటీ ద్వారా న్యాయం పొందవచ్చని, ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి అని, తప్పు చేసి చట్టం తెలియదు అంటే చట్టం ఒప్పుకోదని తెలిపారు. ది 13.12.2025 న తణుకు కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. దానిలో రాజీ పడు క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు రాజీ చేస్తారు, చిన్న చిన్న తగాదాలు రాజీ చేసుకుని విలువైన సమయాన్ని డబ్బును ఆదా చేసుకోవాలని, ప్రశాంతంగా జీవించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు పి.వి.ఎన్. రంజిత్ కుమార్ మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి, తణుకు, జైలు క్లినిక్ న్యాయవాది డి. కృష్ణకుమారి, పారా లీగల్ వాలంటీర్ ఎం. శ్రీదేవి, రిమాండ్ న్యాయవాది అంగజాల అజయ్ కుమార్, జైలు సూపరింటెండెంట్ జి. మోహనరావు సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link