శ్రీ తారకపురి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జనరల్ మెడికల్ క్యాంపు

శ్రీ తారకపురి లైన్స్ క్లబ్ సెక్రెటరీ రామ్ కుమార్ ఆధ్వర్యంలో ఇండియన్ పబ్లిక్ స్కూల్ నందు స్కూల్ విద్యార్థుల విద్యార్థులకు
డాక్టర్ హుస్సేన్ చే ఐ క్యాంప్డా డాక్టర్ అయోషా చే జనరల్ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ హుస్సేన్ మాట్లాడుతూ సరైన పోషకఆహారం తీసుకోకపోవడం చిన్న పిల్లలలో కంటిలోపాలు ఎక్కువగా తలెత్తుతున్నాయని ఇలాంటి సంస్థల ద్వారా ఇలాంటి క్యాంపులు నిర్వహించి చిన్నారులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, తారకాపురి లైన్స్ క్లబ్ ద్వారా ఇంత మంచి కార్యక్రమాలు చేపడుతున్న గెట్ మెంబర్ వావిలాల సరళదేవిని సెక్రెటరీ రామ్ కుమార్ కు అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ అయోషా మాట్లాడుతూ చిన్నతనంలో బాలికల్లో చాలా రుగ్మతలు ఉంటాయి, వారు చెప్పుకోలేరు తల్లిదండ్రులకు ఎంత బాధ్యత ఉందో స్కూల్ టీచర్స్ కూడా అంతే బాధ్యత ఉందని పిల్లల ట్రీట్మెంట్ విషయంలో పేరెంట్స్ ఎట్టి పరిస్థితులోను నెగ్లెట్ చేయకూడదని తెలియజేశారు.
ఈ సందర్భంగా క్లబ్ సెక్రటరీ మాట్లాడుతూ ఎంతో మంచి కార్యక్రమాలు మా క్లబ్ ద్వారా నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసినప్పటికీ సుమారుగా 500 మంది చిన్నారులకు ఐ అండ్ జనరల్ మెడికల్ నిర్వహించి చిన్నారులకు మా క్లబ్ ద్వారా సేవను అందించినందుకు ఆనందంగా ఉందన్నారు.
వావిలాల సరళదేవి మాట్లాడుతూ తణుకులో నిలువెత్తు సేవలకు నిదర్శనం డాక్టర్ హుస్సేన్ అంటారని, ఆయన సహాయం ఈ మెడికల్ క్యాంప్ కు అన్నివిధాల సహకరించినందుకు డాక్టర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు., అదేవిధంగా చిన్నారులను ఎంతో సేవాగుణంతో ట్రీట్మెంట్ అందించిన డాక్టర్ అయేషాకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లైన్ మెంబర్స్ కె. శ్యామల, ఎం.జ్యోతి, బి.రమణ స్కూల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link