సూర్యాలయం అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయాలి

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి

నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం

తణుకు పట్టణంలో ఎంతో విశిష్టత కలిగిన సూర్య దేవాలయం అభివృద్ధికి నూతన కమిటీ మరింత కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. రాష్ట్ర అభివృద్ధి కాకుండా భవిష్యత్తు తరాల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. సూర్యాలయం అభివృద్ధి నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. అధ్యక్షులుగా గమిని రామచంద్రరావుతో పాటు ధర్మకర్తలుగా కొయ్యని సత్యనారాయణ, బడేటి సాయిరాం, కల్వకుంట భవాని, చర్ల వెంకటసుబ్బలక్ష్మి, యజ్జాడ కృష్ణ, లంక దేవి కుమారి, గంటా శ్రీదేవి, ఎలుబూడి నాగమణి, అంబుల సత్యనారాయణలను ఎన్నుకున్నారు. ఎంతోమంది భక్తుల మనోభావాలకు నిలువుటద్దంగా నిలుస్తున్న సూర్యలయం అభివృద్ధికి ధర్మకర్తలు కృషి చేయాలని కోరారు. తణుకు పట్టణంతో పాటు తణుకు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తుల ఆధ్యాత్మిక అనుబంధాన్ని ఏర్పరచుకోవడంలో సూర్య దేవాలయం ముందు వరుసలో నిలుస్తుందని చెప్పారు. ఆలయ అభివృద్ధి కమిటీలో యువతకు ప్రత్యేక స్థానం కల్పించాలనే ఉద్దేశంతో టిడిపి, జనసేన, బిజెపి పార్టీలకు చెందిన పదిమందితో కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సైతం వైశ్యుల నుంచి బయటకు వచ్చి తన గళాన్ని వినిపించిన వ్యక్తి గమిని రామచంద్ర రవు అని కొనియాడారు. విశిష్టమైన దేవాలయంగా పేరుగాంచిన సూర్యదేవాలయం మరింత ప్రతిష్ట పెంచే విధంగా నూతన కమిటీ కృషి చేయాలని కోరారు. కేవలం హిందూ దేవాలయాలే కాకుండా చర్చిలు, మసీదులను సైతం అభివృద్ధి చేసుకొని అన్ని వర్గాల మత విశ్వాసాన్ని కాపాడేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే రాధాకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link