రైతులను నిర్లక్ష్యం చేసిన వైసీపీ నేతలు

రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్న కూటమి ప్రభుత్వం

నియోజకవర్గంలో ఎరువుల కొరత లేకుండా చూసే బాధ్యత నాది

‘రైతన్న నీకోసం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ

గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రైతులను, వ్యవసాయాన్ని అప్పటి నాయకులు నిర్లక్ష్యం చేశారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు మండలం కొమరవరం గ్రామంలో మంగళవారం ప్రారంభమైన రైతన్న నీకోసం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. అరాచకమైన పరిపాలనతో వైయస్ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనతో వ్యవస్థలను సర్వనాశనం చేశారని ఆరోపించారు. గత ఐదువేల కాలంలో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సారథ్యంలో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ వారికి అండగా ఉంటూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో దాన్యం పండించి డబ్బులు చేతికి వచ్చేవరకు రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని అన్నారు. గతంలో రైతులకు కనీసం బీమా చెల్లించలేని పరిస్థితుల్లో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో పోరాడారని గుర్తు చేశారు. గత ఐదేళ్ల కాలంలో రైతులు ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉండేవారని డబ్బులు ఎప్పుడు చేతికి వస్తాయో తెలియని పరిస్థితి ఉండేదని అన్నారు. రైతులు గోనె సంచులు కోసం అడిగితే దుర్భాషలాడే వారని అన్నారు. ధాన్యం రైస్ మిల్లులకు తరలించిన సమయంలో తరుగు పేరుతో రెండు మూడు కేజీలు కోతకోసేవారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడదిన్నర కాలంలోనే అన్ని వర్గాలకు అండగా ఉంటూ రైతులు దాన్యం విక్రయించిన 24 గంటల్లో వారి ఖాతాలో డబ్బులు చామ చేస్తున్నారని గుర్తు చేశారు. కనీసం విలువలు కొరత లేకుండా రైతులకు ఎప్పటికప్పుడు అందజేస్తూ వారిని ఆదుకున్నామని చెప్పారు. ఎరువుల కొరత అంటూ గగ్గోలు పెట్టిన మాజీ మంత్రి కారుమురికి సొసైటీ సిబ్బంది వీడియోలు పెట్టి చూపిస్తే తోకమడిచారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link