భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా 100 కేజీల భారీ కేక్ కట్ చేసిన మంత్రి కందుల దుర్గేష్

తనకు దక్కిన అదృష్టంపై సంతోషం వ్యక్తం చేసిన మంత్రి కందుల దుర్గేష్

పుట్టపర్తి: సామాజిక సేవకు, మానవ సంక్షేమానికి ఆధ్యాత్మికతను సాధనంగా మలిచిన మహనీయుడు శ్రీ సత్య సాయిబాబా ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని మంత్రి కందుల దుర్గేష్ కాంక్షించారు. ప్రముఖ ఆధ్యాత్మికక్షేత్రం పుట్టపర్తి శ్రీ భగవాన్ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం సాయంత్రం ప్రశాంతి నిలయంలో దేశ, విదేశాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తుల సమక్షంలో 100 కేజీల భారీ కేక్ ను కట్ చేశారు.

ఉదయం నుండి భక్తుల ఏర్పాట్ల పర్యవేక్షణలో నిమగ్నమైన మంత్రి కందుల దుర్గేష్ సాయంత్రం పుట్టపర్తి పట్టణంలోని చిత్రావతి నది ఒడ్డున ఉన్న శ్రీ సత్యసాయి పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా మాజీమంత్రి, టిడిపి సీనియర్ నాయకులు పల్లె రఘునాథ్ రెడ్డి, బిజేపి సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి బాబా జీవిత సందేశాన్ని ప్రతిబింబించేలా ప్రదర్శించిన లేజర్ షోను వీక్షించారు.

Scroll to Top
Share via
Copy link