72వ అఖిలభారత సహకార వారోత్సవాలలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామ ప్రాథమిక సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో సహకార వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సహకార పతాకాన్ని జిల్లా సహకార అధికారి ముళ్ళపూడి వెంకటరమణ ఆవిష్కరించగా సొసైటీ చైర్పర్సన్ డాక్టర్ కాకర్ల నరసన్న జండా వదనం చేశారు. అనంతరం సహకార వారోత్సవాల్లో 6వ రోజు కార్యక్రమంలో భాగంగా పర్యాటక ఆరోగ్య హరిత శక్తి డిజిటల్ ప్లాట్ ఫామ్ వంటగది వంటి సాధ్యమైన అభివృద్ధి చెందుతున్న రంగాలలో సహకార సంస్థలను విస్తరించడం గురించి ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్, వారోత్సవాల ఇన్చార్జ్ ఆదిమూలం వెంకటేశ్వర్లు క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా సొసైటీకి చెందిన పదిమంది రైతులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. వారోత్సవాలలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జిల్లా సహకార అధికారి ముళ్ళపూడి వెంకటరమణ ప్రారంభించగా రైతులు గ్రామ ప్రజలు వైద్య సేవలు వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, అయ్యప్ప, సొసైటీ కమిటీ సభ్యులు వడ్డీ దుర్గాప్రసాద్, కొడమంచిలి ఏసేబు, సంఘ సభ్యులు వెలిచేటి బోసు, గన్నమని రామారావు, సకినాల రామకృష్ణ, కేతా రామారావు బొల్లాడ రంగారావు, వడ్డీ పుల్లారావు, కొడమంచిలి దానియేలు, ఈడుపుగంటి భాను పాల్గొనగా సంఘ కార్యదర్శి పి. విష్ణుమూర్తి, పి. కిషోర్, వై.దేవి, పవన్ తదితరులు పాల్గొన్నారు.


