తల్లితండ్రుల పోషణ, సంరక్షణ చట్టంపై గ్రామసచివాలయ సిబ్బందికి అవగాహన

తణుకు మండల ప్రజా పరిషత్ ఆఫీసు కాన్ఫరెన్స్ హాలులో చైర్మన్, నాలుగవ అదనపు జిల్లా జడ్జి ఆదేశముల మేరకు తణుకు ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీ సాయిరాం పోతార్లంక, తల్లితండ్రుల పోషణ మరియు సంరక్షణ చట్టంపై గ్రామసచివాలయ సిబ్బందికి అవగాహన కల్పిస్తూ, ఈ చట్టం 2007లో అమలులోకి వచ్చింది, దీనిప్రకారం అన్యాయానికి గురవుతున్న తల్లితండ్రులు పిల్లల్ని నమ్మి, వారి మోసపు మాటలు నమ్మి వారికి వున్న ఆస్తులు పిల్లల పేరుమీద రాయించుకుని తరువాత వారిని చూడకపోవటము జరుగుతుంది, అలాంటి సమయములో వారు న్యాయము పొందుటకు ఆర్.డి.ఓ అధికారుల ద్వారా న్యాయము పొందవచ్చని, తల్లితండ్రులను చూడని పిల్లకు చట్టము ప్రకారం శిక్షలు కూడా ఉన్నాయని, అలాగే ఇచ్చిన ఆస్తులు తిరిగి తీసుకునే అవకాశం ఉందని, 18 సంవత్సరాలు లోపు పిల్లలు పై లైంగిక దాడులు జరుగుతున్నాయని, కేవలం తెలిసినవారు, దగ్గర బంధువులే దానికి కారణం అని, ప్రతి ఒక్కరూ ముసలి తల్లి నీ తండ్రిని చూడాల్సిన బాధ్యత పిల్లలదే అని తెలియ చేసారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కామన మునిస్వామి, కౌరు వెంకటేశ్వర్లు, పోణంగి శ్రావణి సమీరా, కుమారి కే.దుర్గా భవాని, ఎం.పి.డి.ఓ ఆర్. లోహిత్ జయసాగర్, డాక్టర్ ఎన్.వి.ఆర్. కృష్ణ రెడ్డి, ప్రభుత్వఆస్పత్రిలో తణుకు, పి.ఎల్.వి. కాకర్ల నరసన్న, పోలీసు లైజనింగ్ ఆఫీసర్ కృష్ణమూర్తి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link