అత్తిలి పట్టణంలో డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న అనధికార లే-అవుట్లో పంచాయితీ అనుమతులు కూడా లేకుండా చేపడుతున్న అక్రమ నిర్మాణాలను సోమవారం పంచాయతీ సెక్రటరీ జి.భాస్కర్ తమ సిబ్బందితో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకూ కట్టిన వాటిని అక్కడితో ఆపివేయాలని అనధికార నిర్మాణం చేపట్టిన వారికీ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలియజేశారు. పంచాయతీ నుండి ఎటువంటి అనుమతులు లేకుండా ఇలా అనధికారంగా ఏవిధమైన కట్టడాలు చేపట్టినా చర్యలు తప్పవని అత్తిలి పంచాయతీ సెక్రటరీ జి.భాస్కర్ అన్నారు.


