ప్రతి ఎంవోయూ గ్రౌండ్ అయ్యే విధంగా చర్యలు

:- మంత్రి కందుల దుర్గేష్

ఇన్వెస్టర్లలో నమ్మకం కలిగిందనడానికి సాక్ష్యమే సీఐఐ సదస్సులో వచ్చిన పెట్టుబడులు, కుదిరిన ఎంవోయూలు

విశాఖ సీఐఐ సదస్సు విజయవంతం అయ్యేందుకు సహకరించిన అధికార యంత్రాంగాన్ని, నాయకులను ప్రశంసించిన మంత్రి దుర్గేష్

సీఎం చంద్రబాబు నిత్య కృషీవలుడు అన్న మంత్రి దుర్గేష్.. సీఎం ఆలోచనలను ఆచరణలో పెట్టిన వ్యక్తి యువనేత లోకేష్ అని వెల్లడి

విశాఖపట్నం: విశాఖలో జరిగిన రెండు రోజుల సిఐఐ సమ్మిట్ లో దాదాపు 13 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని, 600 పైగా ఎంవోయూలు కుదుర్చుకున్నామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. అధికారులతో కలిసి సమీకృతంగా పనిచేస్తూ ప్రతి ఎంవోయూ గ్రౌండ్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను, నవ్యాంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పరంగా, సామాజికంగా, రాజకీయంగా ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్న నిత్య కృషివలుడు సీఎం చంద్రబాబు నాయుడు అని మంత్రి దుర్గేష్ అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి పథంలో తీసుకెళుతున్న మార్గదర్శకులు సీఎం చంద్రబాబు నాయుడు అని ఆయన కృషిని అందరం అభినందించాలని అన్నారు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకత్వాన్ని, సమర్థవంతమైన నాయకుడ్ని, దార్శనికతగల నేతను చూసి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని అన్నారు.

కూటమి ప్రభుత్వం ఇన్వెస్టర్స్ లో, ప్రజల్లో నమ్మకం కలిగించడం వల్లనే సిఐఐ సమ్మిట్ విజయవంతమైంది అన్నారు. 2019-24 మధ్యకాలంలో ప్రజలను దగా చేసిన ప్రభుత్వాన్ని, పెట్టుబడిదారులు నమ్మకం కోల్పోయే విధంగా వ్యవహరించిన తీరును మంత్రి దుర్గేష్ తెలిపారు. నాటి పాలకులు ఇన్వెస్టర్లను భయభ్రాంతులకు గురిచేసిన తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ విశ్వసనీయతను, ఇన్వెస్టర్లకు కలిగిస్తున్న నమ్మకాన్ని తద్వారా ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను వివరించారు.

సింగిల్ విండో విధానం ద్వారా ఇన్వెస్టర్లకు త్వరతగతిన అనుమతులు జారీ చేస్తామని, అధికారులు జవాబుదారీతనంతో పని చేస్తారని స్పష్టంగా వెల్లడించిన కూటమి ప్రభుత్వంపై ఇన్వెస్టర్లు నమ్మకం ఉంచారన్నారు..
రండి.. పెట్టుబడులు పెట్టండి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లండి.. యువతకు ఉద్యోగాలు కల్పించండి అన్న నినాదంతో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన మహా యజ్ఞం సఫలీకృతం అయినట్లు మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల ఇన్వెస్టర్లలో పోయినటువంటి నమ్మకాన్ని 15 నెలల కాలంలో తిరిగి తీసుకురావడంలో సీఎం చంద్రబాబు ఎనలేని కృషి చేశారన్నారు. ఇది ఇలాగే కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీల సహకారంతో రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు వెళ్తోందని అన్నారు. స్ఫూర్తివంతమైన నాయకత్వాన్ని సీఎం చంద్రబాబు నాయుడు అందిస్తే దాన్ని ఆచరణలో చూపించిన యువ నేత లోకేష్ అని అన్నారు. రాష్ట్రంలో 3 పార్టీల కలయిక వల్ల డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుందని అన్నారు.

ఈ సందర్భంగా విశాఖపట్నం సీఐఐ సదస్సు విజయవంతం అయ్యేందుకు సహకరించిన అధికార యంత్రాంగాన్ని, నాయకులను మంత్రి దుర్గేష్ ప్రశంసించారు..

Scroll to Top
Share via
Copy link