తణుకులో మాజీ ఎమ్మెల్యే వైటి రాజా వర్ధంతి
నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులు
తణుకు నియోజకవర్గ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే దివంగత వైటి రాజా మార్గదర్శకత్వం చూపించారని రెరా సభ్యులు మంత్రిరావు వెంకటరత్నం అన్నారు. శనివారం మాజీ ఎమ్మెల్యే వైటి రాజా వర్ధంతి పురస్కరించుకొని స్థానిక కూటమి కార్యాలయంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదేశాలు మేరకు సంతాప సభ నిర్వహించారు. తొలుత వైటి రాజా చిత్రపటానికి పూలమాల వేసిన పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి రావు వెంకటరత్నం మాట్లాడుతూ వైటి రాజా రాజకీయాల నుంచి వైదొలగుతూ ఎంతో మంచి రాజకీయ విలువలు కలిగిన ఆరిమిల్లి రాధాకృష్ణను తణుకు నియోజకవర్గానికి పరిచయం చేశారని చెప్పారు. తణుకు నియోజకవర్గంలో అభివృద్ధిలో అదే ఒరవడిని ఎమ్మెల్యే రాధాకృష్ణ కొనసాగిస్తున్నారని చెప్పారు. గతంలో వైటి రాజా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిలో ఆయన మార్కు ఉందన్నారు. రాజకీయపరంగా ఎంతోమందిని తీర్చిదిద్దన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు. మున్సిపాలిటీకి ఆదాయ వనరులు కల్పించే విషయంలో వైటి రాజా చేసిన కృషి అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


