బిహార్లో బిజేపి హవా – ఏ.పి. అధికార ప్రతినిధి డా.ముళ్ళపూడి రేణుక

బీహార్ ప్రజలు మరోసారి అభివృద్ధి రాజకీయాలకు, పారదర్శక పరిపాలనకు, దేశాన్ని ముందుకు నడిపించే సమర్థ నాయకత్వానికి తమ పూర్తి మద్దతు తెలియజేసారు.
నరేంద్ర మోదీ నేతృత్వంపై అచంచల విశ్వాసంతో బీహార్ ప్రజలు ఎన్డీఏ కూటమికి ఘన విజయాన్ని అందించడం దేశవ్యాప్తంగా ఆనందాన్ని నింపింది.

ఈ విజయం భారతీయ జనతా పార్టీ చేపట్టిన అభివృద్ధి ఆజెండాకు, దేశాన్ని వికసిత భారతం వైపు నడిపించే మోదీ దూరదృష్టి నాయకత్వానికి ప్రజల నుండి వచ్చిన భారీ ఆమోదం.

బీహార్ ప్రజలకు, నూతన ప్రభుత్వానికి హృదయపూర్వక అభినందనలు. దేశం ముందుకు సాగడానికి ఎన్డీఏ కూటమి మరింత బలంగా అడుగులు వేస్తుందని సగర్వంగా తెలియజేస్తున్నాను. అందరి కృషి, నిబద్దత, ప్రజాసేవ పట్ల ఉన్న అంకితభావం ఈ విజయానికి ప్రధాన కారణం.
భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో ప్రజల కోసం మరింత సేవ చేయాలని ఆశిస్తూ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేసిన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి డా.ముళ్ళపూడి రేణుక.
బీహార్లో ఎన్డీఏ కూటమి సాధించిన ఘనవిజయం సందర్భంగా తణుకు పట్టణ నరేంద్ర థియేటర్ సెంటర్లో బిజెపి శ్రేణులు బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుతూ విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ, తణుకు పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, పట్టణ జనరల్ సెక్రటరీ ఆర్.అనుకుమార్,
తణుకు పట్టణ ఉపాధ్యక్షులు కసిరెడ్డి మణిదీప్, పట్టణ ఉపాధ్యక్షులు ఆత్మకూరు రామకృష్ణ, కిసాన్ మోర్చా అద్యక్షులు పూలమాల వీరభద్రం, మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు కామర్సు కిరణ్మయి, బిజెపి సీనియర్ నాయకులు ముప్పిడి సుబ్బయ్య, కొడమంచిలి జితేంద్ర, కోడే భాస్కర రావు, నూకల నాగేంద్ర, వంగా రాధాకృష్ణ, పిల్లి శ్రీనివాస్, కరాసు శివప్రసాద్, రేపాక రామారావు, గుడివాడ రామయ్య, దేవరకొండ నాగరాజు, పెమ్మిరెడ్డి శివ గారు, కట్టా సతీష్ మరియు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link