తణుకు మండలంలో కేంద్రాలను ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ శివ
రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ 2025-26 సీజన్ కు సంబంధించి ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తణుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండేటి శివ కోరారు. సోమవారం తణుకు మండలం కోనాల, దువ్వ గ్రామాల్లో ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ధాన్యం మిల్లుకు చేరిన 48 గంటల్లో రైతు ఖాతాలో నగదును జమ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కూటమి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు తప్పుడు సమాచారం నమ్మవద్దని కోరారు. ఎఎంసి వైస్ చైర్మన్ వల్లూరి మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముద్దాపురం పిఎసిఎస్ అధ్యక్షులు ముళ్ళపూడి శ్రీనివాస్, తణుకు సహాయ వ్యవసాయ సంచాలకులు జి.నరేంద్ర, తణుకు మండలం వ్యవసాయ అధికారి కె.రాజేంద్రప్రసాద్, తణుకు తహసిల్దార్ అశోక్ వర్మ, కూటమి నాయకులు బూరుగుపల్లి రమేష్, మహారెడ్డి సత్యనారాయణ, పితాని మోహన్, ఆత్కూరి రామకృష్ణ, చిక్కాల వేణు, చిటికెన సత్యనారాయణ, తోట బుల్లిరాజు, పాలా నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.


