చిరంజీవ చిత్రం సూపర్ హిట్ అవడం చాలా సంతోషంగా ఉంది

ఓటీటిలో దుమ్ము రేపుతుంది హీరో రాజ్ తరుణ్

విశాఖపట్నం: నవంబర్ 10 (కోస్టల్ న్యూస్)

లవర్ బాయ్ రాజ్ తరుణ్ తాజా చిత్రం చిరంజీవి ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది ఈ నేపథ్యంలో విజయయోత్సవ కార్యక్రమం విశాఖలో జరిగింది ఈ సందర్భంగా బీచ్ రోడ్ లో ఓ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ ఆహాతో నాకు మంచి అనుబంధం ఉంది. లాక్ డౌన్ టైమ్ లో నేను చేసిన ఒరేయ్ బుజ్జిగా ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది. ఇప్పుడు చిరంజీవ మూవీ ఈ నెల 7న రిలీజ్ అయింది ఆహా సబ్ స్క్రైబ్ చేసుకుని ఈ సినిమాను చూడాలని కోరుతున్నా. సినిమాకు అందరం కష్టపడతాం. కానీ అభి డైరెక్టర్ గా మా అందరి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ కష్టపడ్డాడు. మంచి హిట్ దక్కించుకునేందుకు అతను అన్ని విధాలా అర్హుడు. ఈ సినిమాలో నాతో పాటు కిరీటి, సంజయ్ కృష్ణ..ఇలా మంచి కోస్టార్స్ నటించారు. వాళ్లందరితో నటించడాన్ని ఎంజాయ్ చేశాను. అన్నారు. డైరెక్టర్ అభినయ కృష్ణ మాట్లాడుతూ 23 ఏళ్లుగా ఇండస్ట్రీలో జర్నీ చేస్తున్నాను. పది పన్నెండేళ్ల నుంచి దర్శకుడిగా ప్రయత్నాలుర్ చేస్తున్నాను. ఈ స్ట్రగుల్ లో ఆహా నుంచి శ్రావణి కి కొన్ని కాన్సెప్ట్స్ చెప్పాను. చిరంజీవ కథ వారికి బాగా నచ్చి మూవీ చేసేందుకు ముందుకొచ్చారు. ఆహా టీమ్ నుంచి మాకు ఎంతో సపోర్ట్ లభించింది. అలాగే మా ప్రొడ్యూసర్స్ రాహుల్, సుహాసినీ కాన్సెప్ట్ ను బాగా నమ్మారు. జబర్దస్త్ చేసేప్పుడు స్కిట్స్ లో కొత్తదనం ఉండేలా చూసుకున్నాను. ఇప్పుడు చిరంజీవ మూవీలో కూడా హీరోకు ఏజ్ మీటర్ అనే కాన్సెప్ట్ పెట్టి కొత్త ప్రయత్నం చేశాను. ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా. దర్శకుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నా. సినిమా బాగుంటే మిగతా వారికి చెప్పండి. ఆహాలో చిరంజీవ మూవీ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

Scroll to Top
Share via
Copy link