వందేమాతరం 150 సంవత్సరాల ఉత్సవం “కార్యక్రమాలలో భాగంగా వందేమాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తియ అయిన సందర్భంగా ఈరోజు ఇరగవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు వందేమాతరం స్ఫూర్తిని మరియు భారతదేశ చరిత్ర మరియు స్వాతంత్య్ర పోరాటంలో దాని ప్రత్యేకతను గుర్తు చేసుకుంటూ బంకించంద్ర ఛటర్జీ ఫోటోకు పూలమాలతో సత్కరించి వందేమాతర గీతాలాపన చేసారు.
సదరు కార్యక్రమములో మండల పరిషత్ అధ్యక్షులు శ్రీమతి కొప్పిశెట్టి అలివేలు మంగతాయారు, కూటమి నాయకులు, ఇంచార్జ్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీమతి వి.రంగమ్మారెడ్డి, మండల స్థాయి అధికారులు మరియు మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది హాజరయ్యారు.


