వందేమాతరం గీతం మన మధ్యకు వచ్చి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా తారకాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సిద్ధార్థ కాలేజీ స్టూడెంట్స్ లైన్స్ క్లబ్ సభ్యులు మధ్యన ఈ గీతాన్ని ఆలపిస్తూ కార్యక్రమం చేయడం జరిగింది . ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వావిలాల సరళాదేవి మాట్లాడుతూ బకించంద్ర చటర్జీ రచించిన ఈ గేయం 150 సంవత్సరాల నుండి ఆనాటికి ఈనాటికి ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తిని మాతృభూమి యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరు హృదయాల్లో నిలిచిపోయేలా ఆయన రచించారని, ఈ గేయం వల్ల ఆరోజుల్లో స్వతంత్ర సమరయోధులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచిందని ప్రతి ఒక్కరిలోనూ కులమతాలకు భేదం లేకుండా ఒకటిగా నడవడానికి ఈ గేయం ఎంతో తోర్పడిందని మనకి స్వతంత్రం రావడానికి ఈ గేయమే మూల కారణమని ఇటువంటి గొప్ప గేయాన్ని ఈ విధంగా మనం పాడుకోవడం గొప్పతనాన్ని తెలుసుకోవడం ఎంతో మంచి కార్యక్రమంగా తెలియజేశారు.
ప్రెసిడెంట్ పవన్ కుమార్ మాట్లాడుతూ ఈ గేయంలోని అర్ధాన్ని ప్రతి విద్యార్థిని విద్యార్థులు తెలుసుకోవాలని ఆ గేయం యొక్క గొప్పతనం గూర్చి వివరించారు.
సెక్రెటరీ రాంకుమార్ గేయాన్ని ఆలపిస్తూ అందరిచేత పాడించి గేయంలోని స్ఫూర్తిని స్టూడెంట్స్ కి వివరించారు
అదేవిధంగా లెక్చరర్ విష్ణు స్టూడెంట్స్ ని ఉద్దేశించి మాట్లాడారు.
ఇంకా ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు కె.శ్యామల, బత్తుల రమణ, వి.జ్యోతి, సిద్ధార్థ గ్రంథాలయం యాజమాన్యం, పాటకులు, కాలేజీ స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు.


