తేతలిలో స్వాతంత్ర్య సమరయోధుల రణన్నిన్నాధం ” వందేమాతరం” ఆలాపన:

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వందేమాతరం గేయ రచన జరిగి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా తేతలి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కోట సూర్య వెంకట విశ్వేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 250 మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉదయం 10 గంటలకు వందేమాతర గీతాన్ని సామూహికంగా ఆలపించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వందేమాతర గేయ రచయిత బంకిం చంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించి వందేమాతర గేయం స్వాతంత్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించిందని, వందేమాతరం భారతీయుల నినాదంగా మారిందని, స్వాతంత్ర్యo అనంతరం ఆ గేయాన్ని జాతీయ గేయంగా అన్ని ప్రభుత్వ కార్యకలాపాల ప్రారంభంలో ఉపయోగిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమానికి సారధ్యం వహించిన జీవశాస్త్ర ఉపాధ్యాయుడు బి.ఎం.గోపాలరెడ్డి విద్యార్థులచే వందేమాతర నినాదాలు చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రథమ సహాయకులు కె. పుల్లారెడ్డి, సిబ్బంది కార్యదర్శి జె. రాజకుమారి, సుధారాణి, గంగ భవాని, రామకృష్ణ, వెంకటేశ్వరరావు, స్వతంత్ర భారతి, బుచ్చియ్య, పుష్పవల్లి, పావని, సూర్య చంద్ర కుమారి, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link