సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక గురజాడ విద్యానికేతన్ ప్రాంగణంలో శుక్రవారం వందేమాతరం 150వ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ బకించంద్ర చటర్జీ నవంబర్ 7 1875 సంస్కృతం, బెంగాలీ భాషల నుండి వందేమాతరం గీతాన్ని స్వరపరిచారని మొదటగా వందేమాతరాన్ని ఆలపించినది రవీందర్ నాథ్ ఠాగూర్ అని అన్నారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ గరిమెళ్ళ సుబ్బరాయ శాస్త్రి మాట్లాడుతూ 24 జనవరి 1950 భారత రాజ్యాంగ సభ వందేమాతర గీతాన్ని భారత ఘనతంత్ర రాజ్యం యొక్క జాతీయ గీతంగా ప్రకటించబడిందని, వందేమాతర గీతం భారతదేశ అధికారిక జాతీయగీతం అని పేర్కొన్నారు. స్కూల్ విద్యార్థిని విద్యార్థులు వందేమాతర గీతాన్ని ఆలపించగా నిర్వాహకులు ప్రిన్సిపల్ గరిమెళ్ళ సుబ్బరాయ శాస్త్రిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు చిటికెన రాణీరత్నప్రభ గొల్ల హెచ్సి, యాదాద్రి మౌనిక, కోరా సత్యనారాయణమూర్తి, ముక్కామల మోహనరావు, బర్రె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


