మానవత సేవలు అభినందనీయం

శాంతిరథం ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మానవత ఆధ్వర్యంలో శాంతి రథాన్ని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సంస్థ అధ్యక్షులు రాజేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు గమిని రాంబాబు ఆధ్వర్యంలో రోటరీ క్లబ్‌ మాజీ అధ్యక్షులు మస్తాన్‌రావు ఆర్థిక సాయంతో శాంతి రథం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా తణుకులో ఎంతో మంది దాతలు సహకారంతో మానవత సంస్థలో ఎంతో మంది భాగస్వాములు కావడంతో మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తున్నారని అన్నారు. గతంలో ఒక శాంతి రథం ఉన్నప్పటికీ రెండో శాంతి రథం తీసుకువచ్చి తణుకుతోపాటు తణుకు పరిసర ప్రాంతాల్లో ఎంతో మందికి సేవలు అందించడానికి తోడ్పాటు అందిస్తున్నారన్నారు. సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలు మరింత మందికి ఆదర్శం కావాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు, కూటమి నాయకుడు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link