బి.సి.లను టార్గెట్ చేసి అరెస్ట్ లు చేస్తున్నారు – మాజీ మంత్రి కారుమూరి

వైసిపి నాయకుడు జోగి రమేష్ అరెస్టు పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా తణుకు వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ 16 నెలల పరిపాలనా కాలంలో అరెస్టులు తప్ప పరిపాలన ఏమీ లేదని అన్నారు. రెండు లక్షల 40 వేల కోట్లు అప్పు ఏమైందో తెలియడం లేదు గాని అరెస్టులు మాత్రం రోజూ కనిపిస్తున్నాయని కారుమూరి అన్నారు. 3,600 కోట్ల లిక్కర్ స్కామ్ పేరుతో కొండను తవ్వి ఎలకను పట్టారని, రాష్ట్రంలో మద్యం ఎరులే పారుతుందని విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ మద్యాంధ్రప్రదేశ్ గా, కల్తీ మద్యాంధ్రప్రదేశ్గా మార్చారని ఆయన అన్నారు. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ మొదటిసారిగా కల్తీ మద్యాన్ని పట్టుకున్నారని, అటువంటి వ్యక్తిపై జనార్ధన్ అనే వ్యక్తి పేరు చెప్పాడని కక్షపూరితంగా గౌడ కులస్తుడు బిసి లకు చెందిన నాయకుడు అని చూడకుండా దారుణంగా అరెస్టు చేశారని, జోగి రమేష్ కనకదుర్గమ్మ గుడి లో కూడా ప్రమాణం చేశారని అటువంటి వ్యక్తిని కావాలని కక్షతో లిక్కర్ స్కామ్ కేసులో ఇరికించారని, ఇటువంటి పరిస్థితులలో రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనే విధంగా, సిటీ మధ్యలో కల్తీ మద్యం నడుస్తూ ఉంటే ఎక్సైజ్ శాఖ ఏమైంది పోలీసు శాఖ ఏమైంది, మీ ఇంటిలిజెన్స్ ఏమైంది అసలు పరిపాలన ఉందా అని నేను అడుగుతున్నానని కారుమూరి అన్నారు. మీ ఎమ్మెల్యేలను ఎందుకు అరెస్టు చేయడం లేదు . యదేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు, దోచుకుంటున్నారు ఒకపక్క మద్యం బెల్టు షాపులు కల్తీ మద్యం తయారీ, ఇసుక, క్రికెట్ బెట్టింగ్, పేకాట స్థావరాలు, మట్టి, పనికి ఆహార పథకంలో అవినీతి, గంజాయి అమ్మకాలు బచ్చలవిడిగా జరుగుతూ ఉంటే… లంచాలు తీసుకుని మేము అభివృద్ధి చేస్తున్నాం స్టేడియాలు కట్టిస్తున్నాం అని సాక్షాత్తు కూటమి ఎమ్మెల్యేని చెబుతున్నారని కారుమూరి అన్నారు. కాపు కులానికి చెందిన వ్యక్తులను ఫార్చునర్ కారు ఎక్కించి తొక్కి చంపిన వ్యక్తులను ఇప్పటికీ అరెస్టు చేయలేదని, జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి చనిపోని వ్యక్తిని కథలు అల్లి… జగన్ కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు చేశారని ఆయన అన్నారు. కారులో ఉండి చంపు చంపు అన్న వ్యక్తులపై కేసులు పెట్టలేదని, అమాయకుడైన జోగి రమేష్ నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేశారని అన్నారు. బీసీలను టార్గెట్ చేసి కక్ష సాధింపు చర్యలను చేస్తున్న ప్రభుత్వ అరెస్టులను ఖండిస్తున్నామని కారుమూరి అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link