విశాఖపట్నం: నవంబర్ 1 (కోస్టల్ న్యూస్)
ఉత్తరాంధ్రలో నూతనంగా వెలువడిన న్యూస్ నిఘానేత్రం పత్రిక తొలి సంచికను జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు చేతులు మీదుగా న్యూస్ నిఘా నేత్రం శీర్సికను ఘనంగా ప్రారంభించారు. గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఒకరి నుంచి మరొకరికి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరడం వలన పలు సమస్యలు పరిష్కరించుకోవడానికి మార్గం సుగమవుతుందని, ఒక సమస్యను ఫిర్యాదు చేయడం ద్వారా పరిష్కారం అయ్యే సమయం కన్నా వార్తా ప్రసార సాధనాల ద్వారా ప్రచురితమైన సమస్య వేగంగా పరిష్కారమవుతుందని గంట్ల శ్రీనుబాబు కొనియాడారు. రానున్న కాలంలో న్యూస్ నిఘా నేత్రం పత్రిక మరింత పురోభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ న్యూస్ నిఘా నేత్రం పత్రిక శీర్షికను ఘనంగా ప్రారంభించారు. న్యూస్ నిఘానేత్రం పత్రిక ఎడిటర్ పబ్లిషర్ పక్కి రమేష్ మాట్లాడుతూ, నిజాన్ని నిర్భయంగా రాసే పత్రికగా సామాజిక రాజకీయ ఆర్థిక అంశాలపై నిష్పాక్షిక విమర్శనాస్త్రాలను సంధించటంలో తిరుగులేని పత్రికగా న్యూస్ నిఘానేత్రం దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పిల్లా సతీష్ బాబు, సుంకర రాజా, సిహెచ్ మదన్, జె. శివరామకృష్ణ, కే.వినయ్, కే.గౌతమ్, ఐ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


