సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ చౌక్ వద్ద ఉన్న కర్ణాటక బ్యాంక్ ప్రాంగణమందు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని ఘనంగా శుక్రవారం నిర్వహించినారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ పటేల్ జన్మదిన జాతీయ ఐక్యత దినోత్సవం భారతదేశ తొలి హోం మంత్రి తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అన్నారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముళ్ళపూడి నారాయణరావు మాట్లాడుతూ మాట్లాడుతూ స్వాతంత్ర సమాజ యోధుడు రాజానీతిజ్ఞడు , నిష్కలంక దేశభక్తుడు సర్దార్ పటేల్ అని అన్నారు. ఈ సందర్భంగా పటేల్ జీవిత చరిత్రలపై సదస్సు నిర్వహించగా పలువురు మాట్లాడినారు.
అనంతరం ప్రముఖ పారిశ్రామికవేత్త ముళ్ళపూడి నారాయణ రావు నిర్వాహకులు ఘనంగా సత్కరించినారు.
ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ గోపి గణేష్, అసిస్టెంట్ మేనేజర్ శివాల వసంతరావు, క్యాషియర్ అమీరపు రవికుమార్, సిబ్బంది శీలం శక్తి శివ, హెచ్. ఏ. గోకులరామ్, జక్కం శెట్టి కిషోర్, సి.టీ. విజయ్ కుమార్, పి విజిత్ కుమార్, కోరా సత్యనారాయణమూర్తి, ముక్కామల మోహన్ రావు, బర్రె శ్రీనివాసు, ఆలపాటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


