తాడేపల్లి ప్యాలెస్‌లోనే కల్తీ మద్యం ఫార్ములా

కూటమి ప్రతిష్ట దెబ్బతీయడానికే కుట్ర

జగన్‌ పాలనలోనే పేదల ప్రాణాలు పోయాయి

మద్యం మాఫియాలో వైసీపీ నేతలే భాగస్వాములు

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ధ్వజం

త అయిదేళ్ల లిక్కర్‌ మాఫియా అంశంలో ప్రజల దృష్టి మళ్లించడానికే జగన్‌మోహన్‌రెడ్డి కుట్రలకు ప్రణాళిక చేశారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ధ్వజమెత్తారు. కల్తీ మద్యం ఫార్ములా తాడేపల్లి ప్యాలెస్‌లో తయారు చేసి కూటమి ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే కుట్రపూరితంగా కల్తీ మద్యం ఫార్ములాను తయారు చేశారని ఆరోపించారు. గురువారం ఎమ్మెల్యే రాధాకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. చిన్ననాటి స్నేహితులైన జనార్థనరావు, జోగిరమేష్‌లు నకిలీ మద్యానికి పక్కా ప్రణాళికలు చేశారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం తయారీ కంపెనీలన్నింటినీ జగన్‌మోహన్‌రెడ్డి తన గుప్పెట్లో పెట్టుకుని జె బ్రాండ్లు మాత్రమే తయారు చేసి దీని ద్వారా 30 వేల మంది ప్రాణాలను తీశారన్నారు. గత అయిదేళ్లలో సరఫరా చేసిన జె బ్రాండ్లులో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు చెన్నై, బెంగళూరు, అమెరికా లాబొరేటరీలు స్పష్టం చేశాయన్నారు. టాంజానియా, ఐవరీకోస్ట్, ఘనా, జాంబియా, మొజాంబిక్‌ దేశాల్లో జగన్‌మోహన్‌రెడ్డి సన్నిహితులు మద్యం వ్యాపారం చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో జంగారెడ్డిగూడెంలో కల్తీ నాటుసారా తాగి 27 మంది పేదల ప్రాణాలు పోతే కనీసం పోస్టుమార్టం చేయలేదని, విచారణ చేయకుండా కేసును పక్కదోవ పట్టించారని ఆరోపించారు. ఇటీవల ఏలూరులో ఒకరు చనిపోతే కూటమి ప్రభుత్వం పోస్టుమార్టం చేయించి విచారణ చేపట్టిందని గుర్తు చేశారు. ఏలూరు సంఘటనకు సంబంధించిన మద్యాన్ని ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌ ల్యాబ్‌ కల్తీ మద్యం కాదని నిర్థారించిందన్నారు. జగన్‌ పాలనలో 3 లక్షల బెల్టు షాపులు నిడిస్తే కూటమి ప్రభుత్వం బెల్టు షాపులకు చెక్‌ పెట్టిందన్నారు. మద్యం ఏ స్థాయిలోనూ కల్తీ అయ్యేందుకు ఆస్కారం లేకుండా డిస్టలరీలు, డిపోలు, మద్యం షాపులు, బార్లలో ఆకస్మిక తనిఖీలు చేసి శాంపిళ్లను సైతం సేకరించి పరీక్షలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ వెల్లడించారు.

Scroll to Top
Share via
Copy link