ఒక తెలుగు వార్త ఛానల్ లో రాష్ట్ర మంత్రి దుర్గేష్ కూటమి ధర్మాని పాటించడం లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించినట్టుగా వచ్చిన వార్తను అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు కటకం రామకృష్ణ, జనసేన నాయకులు తిర్రే రవిదేవా, సాదా వెంకటేష్ ఖండించారు.
ఈ సందర్బంగా ఉండ్రాజవరంలో మంగళవారం విలేకరులతో నాయకులు మాట్లాడుతూ వార్త ఛానల్ లో వచ్చిన వార్తలో వాస్తవం లేదని కొందరు మంత్రి దుర్గష్ పై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కూటమి ధర్మాని పాటిస్తూ ప్రతి విషయంలో తెలుగుదేశం కార్యకర్తలకు పెద్దపీట వేస్తున్నారని, అత్యధిక నామినేటెడ్ పదవులు, ముఖ్యమైన పదవులు తెలుగుదేశం పార్టీ వారికే ఇస్తున్నారని, ప్రతి అధికారిక కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులను కలుపుకుని వెళ్తున్నారని తెలిపారు, రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీలు గెలిచిన స్థానలలో ఏ పార్టీ గెలిచిన నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకులే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు తీసుకుంటే మంత్రి దుర్గేష్ మాత్రం నిడదవోలు నియోజకవర్గం మార్కెట్ కమిటీ తెలుగుదేశం పార్టీకీ ఇచ్చారని అన్నారు.
కొందరు కావాలనే మంత్రి దుర్గేష్ పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, రాష్ట్ర మంత్రిగా, స్థానిక శాసన సభ్యుడిగా నియోజకవర్గాని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని, విమర్శలు మాని నియోజకవర్గం అభివృద్ధికీ అందరూ మంత్రి దుర్గేష్ తో కలిసిరావాలని రామకృష్ణ, రవిదేవా హితవు పలికారు, ఇంకా ఈ కార్యక్రమంలో సాధా వెంకటేష్ పసుపులేటి చిన్నారావు, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.


