ఆపదలో అండగా.. సీఎంఆర్‌ఎఫ్ తో తోడుగా

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలులోని క్యాంపు కార్యాలయంలో 49 మంది బాధితులకు రూ. 22.44 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్

ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి క్రింద 437 మందికి రూ.3.32 కోట్ల లబ్ధి చేకూర్చామని మంత్రి దుర్గేష్ వెల్లడి

ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని తెలిపిన మంత్రి కందుల దుర్గేష్

సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన మంత్రి దుర్గేష్

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, అత్యవసర వైద్య చికిత్స అవసరమైతే సాయం అందించడంలో మంత్రి కందుల దుర్గేష్ ఎప్పుడు ముందుంటారని హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు

నిడదవోలు: ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబునాయుడు పని చేస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మంగళవారం నిడదవోలులోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా నిడదవోలు నియోజకవర్గంలో అనారోగ్యం బారిన పడిన 49 మంది బాధితులకు రూ. 22,44,616 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ పంపిణీ చేశారు. బాధితులతో మంత్రి దుర్గేష్ మాట్లాడి వారి ఆరోగ్య వివరాలపై ఆరా తీశారు. సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరం అని,పేదల ఆరోగ్యానికి సిఎంఆర్ఎఫ్ భరోసా ఇస్తుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి క్రింద 437 మందికి రూ. 3,32,45,453 మేర లబ్ధి చేకూర్చామని వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి పేదవానికి అండగా నిలుస్తోందని, ఆర్థికంగా ఇబ్బందులున్న వారికి సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా ఉంటుందని తెలిపారు. సీఎంఆర్ఎఫ్ ల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారన్నారు. ఏ చిన్న అప్లికేషన్ వచ్చినా కూడా వెంటనే ఆమోదిస్తూ సీఎం తన ఔదార్యాన్ని చాటుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు మంత్రి దుర్గేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకున్న అనంతరం బాధిత లబ్ధిదారులు సీఎం చంద్రబాబు నాయుడుకు, మంత్రి కందుల దుర్గేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, అత్యవసర వైద్య చికిత్స అవసరమైతే సాయం అందించడంలో మంత్రి కందుల దుర్గేష్ ఎప్పుడు ముందుంటారని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి వెళ్లిందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇటీవలే ఆటో కార్మికులకు అందించిన సాయాన్ని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ గుర్తుచేశారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో పాటు దీపం -2 ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం తదితర హామీల ద్వారా ప్రజలకు అందించిన లబ్ధిని మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. మెగా డీఎస్సీ ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. పీఎం నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ గా ముందుకు వెళ్తుందని మంత్రి దుర్గేష్ అన్నారు.

ఈ సీజన్ లో ధాన్యం సేకరణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి దుర్గేష్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 5.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అంచనా వేశామని, ఇప్పటికే 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ యంత్రాంగాన్ని సిద్ధం చేశారని పేర్కొన్నారు. మిల్లర్లతో చర్చించి ప్రతి గోనె సంచికి రూ.4కు పైగానే చెల్లిస్తున్నామన్నారు. గోనె సంచులకు చిల్లులు లేకుండా నాణ్యతతో కూడినవి అందజేయాలని ఆదేశించామన్నారు. రైతుకు కనీస మద్దతు ధరను రూ.69కి పెంచిందని గుర్తుచేశారు.

డొక్కా సీతమ్మ పేరుతో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనం విషయంలో ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టిందని, ఈ ఏడాది నుండి సన్నబియ్యంతోనే విద్యార్థులకు భోజనం పెట్టనున్నామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. అందుకు సంబంధించి ప్రత్యేకంగా ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మధ్యాహ్న భోజనానికి డొక్కా సీతమ్మ పేరును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించగా సీఎం చంద్రబాబునాయుడు అమలు చేశారని మంత్రి కందుల దుర్గేష్ గుర్తుచేశారు.

Scroll to Top
Share via
Copy link