జిల్లా అభివృద్ధిపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం
జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. మంగళవారం భీమవరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో జిల్లా స్థాయిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు తీరు, వివిధ సంస్థల సమన్వయం, నిధుల వినియోగాన్ని మెరుగుపరచడం ద్వారా జిల్లా అభివృద్ధి చెందడం వంటి విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణతోపాటు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్రెడ్డి, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ప్రభుత్వ విప్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఇతర జిల్లా అధికారులు హాజరయ్యారు.


