తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు యువకులకు సకాలంలో చికిత్స అందించడంతోపాటు జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోకుండా అధికారులను ఎమ్మెల్యే రాధాకృష్ణ సమన్వయం చేసిన ఘటన మంగళవారం తణుకులో చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై మోటారుసైకిల్‌పై వెళుతున్న ఇద్దరు యువకులు ప్రమాదానికి గురయ్యారు. ఇదే సమయంలో అటుగా వెళుతున్న ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆగి అంబులెన్స్ వాహనం వచ్చే వరకు అక్కడే ఉండి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సకాలంలో చికిత్స అందించడంతోపాటు రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోకుండా అధికారులను అప్రమత్తం చేశారు. సమాజానికి ఉపయోగపడేలా సేవ చేయడం, అనుకోని ప్రమాదం లేదా అన్యాయం జరిగినప్పుడు తక్షణమే సాటి మనిషిగా అండగా నిలిచిన ఎమ్మెల్యే రాధాకృష్ణ తీరును పలువురు ప్రసంశించారు.


