మూడు సంవత్సరాల వయసులో విప్లవ తుపాకీ మొక్కలు నాటిన విప్లవ బాలుడు యువకిశోరం భగత్ సింగ్ నేటి యువతకు స్ఫూర్తిదాయకమని భగత్ సింగ్ యువజన సంఘం గ్రామ కమిటీ అధ్యక్షులు సిద్ధాని శివ గణపతి అన్నారు. వేల్పూరు భగత్ సింగ్ యువజన సంఘం ఆధ్వర్యంలో సర్దార్ భగత్ సింగ్ 118 వ జయంతి సందర్భంగా ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివ గణపతి మాట్లాడుతూ 1907 లో పంజాబ్ లో కిసాన్ సింగ్ విద్యావతి దంపతులకు జన్మించిన భగత్ సింగ్ 12 సంవత్సరాలు వయసులోనే సామాజిక.ఆర్థిక.రాజకీయ ఆర్థిక అంశాలకు సంబంధించి వందకు పైగా పుస్తకాలు అధ్యయనం చేశాడంటే తన వయసు గల పిల్లల కంటే భగత్ సింగ్ ప్రత్యేకమైన వ్యక్తి అని ఆయన కొనియాడారు. ఎందుకంటే భవిష్యత్తుకి బాల్యమే మొలక. మొలకలు వేసే వయసులో తుపాకులు మొలకెత్తించాలని చూడడం అతని వ్యక్తిత్వానికి ఆయనకి ఉన్న దేశభక్తికి మచ్చుతునకని ఆయన పేర్కొన్నారు. దేశ స్వాతంత్రం కోసం సాగించిన పోరాటంలో బందీగా లొంగిపోయిన భగత్ సింగ్ తమ ఆత్మ బలిదానం దేశవ్యాప్త ఆందోళనకారులకు ఉత్తేజం కలిగించాలని తన శరీరంలోని ప్రతి రక్తపు చుక్క విప్లవం వర్ధిల్లాలి. ఇంకిలాబ్ జిందాబాద్ అంటూ వెలుగెత్తి చాటుతోందని ఆయన అన్నారు. భారతీయ గుండెల్లో ఎప్పటికీ సరస్మరణీయంగా ఉండే ఒక అగ్ని కణం భగత్ సింగ్ అని ఆయన ఆశయ సాధన కోసం నేటి యువత ముందుకు సాగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దున్నే రుద్ర నాగేశ్వరరావు. మోటుపల్లి తరుణ్. విశ్వనాథం శివ. తిప్పా త్రినాథ్. తాడిశెట్టి స్వామి. పొన్నకోటి కిరణ్. విశ్వనాథం సురేష్. అంగాని రామ్ చంద్ర వర్మ . చల్లా కిషోర్. వద్ది మహేష్ తదితరులు పాల్గొన్నారు.


