ప్రముఖ కవి గుర్రం జాషువా జయంతి

సాహితి సామ్రాజ్యం ఆధ్వర్యంలో తణుకు విజయ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ప్రాంగణంలో ప్రముఖ కవి గుర్రం జాషువా జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ అక్షర యోధుడు అనితర సాధ్యుడు గుర్రం జాషువా అని అన్నారు. గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఉపాధ్యాయులు నల్ల నారాయణమూర్తిని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవయుగ కవి చక్రవర్తి కవిత దిగ్గజం గుర్రం జాషువా ఎన్నో కవితల ద్వారా ప్రజా చైతన్యానికి కృషి చేశారని అన్నారు. గుర్రం జాషువా జీవిత చరిత్ర పై నిర్వహించిన సదస్సులో పలువురు వక్తలు మాట్లాడి ఆయన జీవిత విశేషాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్య నిపుణులు జీ.వి. సుబ్బారావు, ఆసుపత్రి సిబ్బంది టేకు కృష్ణ పిట్ట అశోక్, కె. మోహన్, పి.నాగరాజు పి.విజయ, కే.శాంతి, పి. ప్రియాంక, సాహితీ సామ్రాజ్యం సభ్యులు గుర్రం తాతారావు, బర్రె శ్రీనివాసు, ఆలపాటి సుబ్బారావు, ముక్కామల మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link