తిరుమలలో భక్తులకు నూతన వసతి సముదాయం

ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ తో కలిసి ప్రారంభించిన సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు

తిరుమల, 2025, సెప్టెంబర్ 25: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు నూతన వసతి సముదాయం అందుబాటులోకి వచ్చింది. ఉపరాష్ట్రపతి గౌరవ శ్రీ సీపీ రాధాకృష్ణన్ తో కలిసి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నూతన వసతి సముదాయాన్ని (వేంకటాద్రి నిలయాన్ని) ప్రారంభించారు. పీఏసీ 5ను రూ.102 కోట్ల వ్యయంతో టీటీడీ నిర్మించింది. ఎలాంటి ముందస్తు బుకింగ్ లేకుండా వచ్చిన భక్తులకు వసతి కల్పించేందుకు గానూ నూతన వసతి సముదాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ భవనం ద్వారా ఒకేసారి 4 వేల మంది భక్తులకు ఉచిత వసతి సౌకర్యం కల్పించేలా నిర్మించారు.

ఈ నూతన వసతి సముదాయంలో 16 డార్మిటరీలు, 2400 లాకర్లు, 24 గంటలూ వేడినీటి సదుపాయం తదితర సౌకర్యాలతో ఈ పిలిగ్రిమ్స్ అమెనిటీస్ సెంటర్ 5 ను తీర్చిదిద్దారు. అలాగే

ఒకేసారి 80 మంది భక్తులు తలనీలాలు సమర్పించేందుకు వీలుగా కల్యాణ కట్టను కూడా ఈ పీఏసీ 5 ప్రాంగణంలో టీటీడీ ఏర్పాటు చేసింది. ఒకేసారి 1400 మంది భక్తులు భోజనం చేసేందుకు వీలుగా ఈ కాంప్లెక్సులో రెండు భారీ డైనింగ్ హాళ్లను కూడా అందుబాటులో ఉంచారు.

ఈ సందర్భంగా వసతి గృహం బుకింగ్ కౌంటర్ లో బుకింగ్ జరుగుతున్న విధానాన్ని అధికారులు వివరించారు. తొలి వసతి బుకింగ్ టోకెన్ ఓ భక్తురాలికి సీఎం చంద్రబాబు అందించారు. తిరుమల పోటులో కొత్తగా తీసుకువచ్చిన ప్రసాదం తయారీ కోసం వినియోగించే సార్టింగ్ యంత్రాలను ప్రారంభించారు. అనంతరం ఈ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన వేస్ట్ కలెక్షన్ (వ్యర్థాల సేకరణ) యంత్రాన్ని ఇరువురు నేతలు ఆసక్తిగా పరిశీలించారు.

Scroll to Top
Share via
Copy link