పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో బుధవారం సాయి స్కూల్ ప్రాంగణంలో వావిలాల గోపాలకృష్ణయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరజ్వాల ఆంధ్ర ప్రజల హృదయ జ్వాల వావిలాల గోపాలకృష్ణయ్య అని అన్నారు. ఈ సందర్భంగా వావిలాల గోపాలకృష్ణయ్య జయంతిని పురస్కరించుకుని సాయి స్కూల్ డైరెక్టర్ గురు మురళీకృష్ణ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు అనంతరం స్కూలు డైరెక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ ఆజన్మాంతరం బ్రహ్మచారిగా జీవించిన వావిలాల గోపాలకృష్ణయ్య తాను జీవించినంత కాలం ప్రజాసేవలోనే గడిపారని అన్నారు. వావిలాల గోపాలకృష్ణయ్య జీవిత చరిత్రపై సదస్సు నిర్వహించి విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఇన్చార్జి సంగిడి ప్రేమ కృష్ణ, ఉపాధ్యాయులు గాలింకి విమల గ్రేస్, కాకరపర్తి అపర్ణ పినిశెట్టి రామలక్ష్మి, వేగి దీప్తి కట్ట శ్రీలక్ష్మి, భీమవరపు హేమలత, సాహితీ సామ్రాజ్యం సభ్యులు ముక్కామల మోహనరావు బర్రె శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.


