శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేట్ అథారటీ (రెరా) సభ్యుడిగా తణుకు పట్టణానికి చెందిన టిడిపి పట్టణ అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ వైస్‌ఛైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం (బాబు) నియామకం పట్ల తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. రెరా ఛైర్మన్ ఎ.శివారెడ్డితోపాటు సభ్యులు బుధవారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. రెరా ద్వారా క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడానికి కమిటీ కృషి చేయాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు.


