పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం నందు వేంచేసిన శ్రీ మద్ విరాట్ విశ్వకర్మ స్వాముల వారి యజ్ఞోత్సవములు అత్యంత వైభోగంగా ప్రారంభమైనవి. తొలుత స్థానిక శుభం గ్రాండ్ దగ్గర ఆలయ చైర్మన్ తమిరి శ్రీనివాస్ చే విశ్వకర్మ పతాకావిష్కరణ జరిపినారు. తదుపరి ఊరేగింపుగా బయలుదేరి గుడి వద్దకు వెళ్లి స్వామివారి విగ్రహ ప్రతిష్ట మరియు కలశ స్థాపన చేసి హోమం పూజలు నిర్వహించి అనంతరం ప్రసాద వితరణ తెలిపినారు ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ ముండూరి వీరభద్రాచార్యులు వారేచే జరుపబడినవి. ఇంకా ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నాగమల్లి సాంబశివరావు, మందరపు నాగ మనోహర్, కోరుమిల్లి సుబ్బారావు, వెండి శ్రీను, తమిరి వెంకట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


