మహిళ ఆరోగ్యం ద్వారానే ఆరోగ్యకరమైన సమాజం
రుతుక్రమం పరిశుభ్రతపై మహిళలు అవగాహన కలిగి ఉండాలి
క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఎప్పటికప్పుడు చేయించుకోవాలి
ప్రముఖ ఐటీ కన్సల్టెంట్ ఆరిమిల్లి కృష్ణ తులసి వెల్లడి
రుతుక్రమ పరిశుభ్రత, క్యాన్సర్ పై తణుకులో అవగాహన సదసు

పుట్టుకతో వచ్చిన ఒక వరం మహిళ అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి, ప్రముఖ ఐటీ కన్సల్టెంట్ (సింగపూర్) ఆరిమిల్లి కృష్ణ తులసి అన్నారు. మహిళ ఆరోగ్యంగా ఉండడం ద్వారానే కుటుంబం
తద్వారా సమాజం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. తానేటి చారిటబుల్ ట్రస్ట్, హోప్ ఫర్ లైఫ్ సంయుక్తంగా రుతుక్రమ పరిశుభ్రత, క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని శనివారం తణుకు శ్రీ ముళ్ళపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ తులసి మాట్లాడుతూ బాలికల్లో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు కనీసం తల్లిదండ్రులతో చొప్పుకోని పరిస్థితిలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుతుక్రమ పరిశుభ్రతలో ముఖ్యంగా బాలికలు పరిశుభ్రంగా ఉండడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. రుతుక్రమం సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండగలం అనే అంశంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. రుతుక్రమం సమయంలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఎదురైతే సిగ్గుపడకుండా వైద్యుల వద్దకు వెళ్లాలన్నారు. మహిళలు గర్భాశ క్యాన్సర్లు, బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్లు వంటి వాటిపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ముఖ్యంగా 9 నుంచి 14 ఏళ్లలోపు బాలికలు తప్పనిసరిగా హెచ్.పీ. వీ వ్యాక్సిన్ వేయించుకునేలా తల్లిదండ్రుల్లో అవగాహన తీసుకురావాలన్నారు,అనంతరం హుక్స్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ వారి సహకారంతో 400 మంది విద్యార్థులకు శానిటరీ ఫ్యాట్స్ ని పంపిణీ చేయడం జరిగింది . పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. తులసిరాధ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విజయవాడ మణిపాల్ వైద్యులు డాక్టర్ శ్రీవిద్య,ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ వి.ఆశాజ్యోతి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

