ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత దివ్యాంగులను వేధింపులు, మనోవేదనకు గురి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగ విభాగం పశ్చిమగోదావరిజిల్లా అధ్యక్షులు బుడితి సుజన్ కుమార్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఫించన్లు పెంచేశామని ప్రచారం చేసుకుని మరోపక్క జిల్లాలో వేలాదిమంది దివ్యాంగుల ఫించన్లు తొలగించేందుకు కూటమి ప్రభుత్వం పూనుకోవడం దుర్మార్గం అని అన్నారు.దివ్యాంగుల ఫించన్లు నిలిపివేస్తూ ఇచ్చిన నోటీసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, వెరిఫికేషన్ పేరుతో మానసిక ఆందోళనకు గురిచెయ్యొద్దని, దివ్యాంగులకు ఇంటి వద్దనే వైకల్యం శాతం నిర్దారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ భీమవరంలో గల కలెక్టర్ వారి కార్యాలయం నందు జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అధికారులను కలిసి వినతిపత్రం అందజేశామని సుజన్ కుమార్ తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం దివ్యాంగులపై కక్షసాధింపు చర్యలు, వేధింపులు మానుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన మరింత తీవ్ర స్థాయిలో ఉదృతంగా ఉంటుందని ఈ సందర్భంగా సుజన్ తెలియజేశారు.


