తణుకు మండలం దువ్వ శ్రీ నేతాజీ సోషల్ సర్వీస్ సొసైటి ఆధ్వర్యంలో దువ్వ గ్రామంలో ఎస్సీ ఏరియా, గ్రామస్తుల సహకారంతో ఫ్రీజర్ ని కొనుగోలు చేయడం జరిగిందని ఈ సంస్థ అధ్యక్షుడు సిర్రా ధనరాజు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆదివారం స్థానిక వాటర్ ట్యాంక్ వద్ద ఫ్రీజర్ ని గ్రామస్తుల సమక్షంలో ప్రారంభించారు. ఈ ఫ్రీజర్ గ్రామంలో ఎవరికి అవసరం వచ్చినా దీనిని ఉపయోగించుకోవచ్చని రానున్నకాలంలో గ్రామానికి ఒక అంబులెన్స్ ప్రజలకు అవసరమైన పనులు చేయడానికి గ్రామస్తుల సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తణుకు మండల పరిషత్ అధ్యక్షులు రుద్రా ధనరాజు, దువ్వ గ్రామ సర్పంచ్ అడ్డా బాబు, ఎంపిటిసిలు పెనుమాక అశోక్, తాతపూడి శ్రీనివాస్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ మల్లెల డేవిడ్, పత్తి రామకృష్ణ, చేకూరి ప్రసాద్ రాజు, అరిగెల బాబీ, సిరిగిసెట్టి సూరిబాబు, శ్రీరాముల చిన్ని , రేవూరు శ్రీను, సింహాద్రి సూర్య భగవాన్, కొడమంచిలి కోటి, రాచర్ల ప్రకాష్, కొడమంచిలి వెంకటరాజు, కొడమంచిలి కిరణ్, గెల్లా నాగేశ్వరావు, కొడమంచిలి సుధాకర్, పాస్టర్ జయానందం, నూతంగి శ్రీను, టి. అప్పలస్వామి, నారికి మిల్లి ప్రభాకర్, చాట్ల రమేష్, నేకూరి కృష్ణ, సనమండ్ర పెద్ద గోతియ్య, సిర్రా వరదరాజు, బాదంపూడి శ్రీను, జాలాది రమేష్ తదితరులు పాల్గొన్నారు.


