జీవీఎంసీ కౌన్సిల్ లో వార్డు సమస్యలు వినిపించిన గంకల కవిత అప్పారావు యాదవ్
నార్త్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజుతో కలిసి జీవీఎంసీ కమీషనర్ కు వినతి అందజేత
విశాఖపట్నం: ఆగస్టు 23 (కోస్టల్ న్యూస్)
జీవీఎంసీ 48వ వార్డులో మౌళిక వసతులు కల్పించాలని 48వ వార్డు కార్పొరేటర్, జీవీఎంసీ భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్,స్టాండింగ్ కమిటీ మెంబెర్ గంకల కవిత అప్పారావు యాదవ్ జీవీఎంసీ కౌన్సిల్ లో గళమెత్తారు. వార్డులో పలు సదుపాయాలు కల్పించాలని శుక్రవారం జరిగిన జీవీఎంసీ కౌన్సిల్ లో జీవీఎంసీ కమీషనర్ కేతాన్ గార్గ్ కు నార్త్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజుతో కలిసి వినతి అందజేశారు. 48వ వార్డులో ఇందిరానగర్ -2, న్యూ శ్రీనివాస్ నగర్, శ్రీనివాస్ నగర్ లో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ ను ఏర్పాటు చేయాలని, శ్రీనివాస్ నగర్ పోలీస్ లైన్ ప్రాంతంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు, వార్డుకు 20 రింగ్ పోల్స్, 50 సోలార్ విద్యుత్ దీపాలు,వార్డు పరిధిలో సుమారు 11 చేతి బోరు పంపులు ఏర్పాటు చేయాలని, వార్డుకు అదనంగా పారిశుధ్య సిబ్బందిని కేటాయించాలని, స్మశాన వాటికకు పర్మినెంట్ సెక్యూరిటీ గార్డును, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఒక సెక్యూరిటీ గార్డ్,సీసీ కెమెరాలు ను ఏర్పాటు చేయాలని, ప్రధాన జంక్షన్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు,ఇందిరానగర్ 4,5 మధ్యలో గల ప్రధాన గెడ్డ, ఇందిరా నగర్ -3 లో ఉన్న గెడ్డ, జై భారత్ నగర్, ఏ ఎస్ ఆర్ కాలనీ లో గల గెడ్డ మరమ్మతులు చేయాలనీ, పల్నాటి కాలనీ, శివలింగపురం, నీలకంఠ నగర్ లో రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయాలనీ, వార్డులో సచివాలయం లో కనీస సదుపాయాలు కల్పించాలని వినతి అందజేశారు.ఈ వినతిపై కమీషనర్ సానుకూలంగా స్పందించారని గంకల కవిత అప్పారావు యాదవ్ తెలిపారు.


