గుంటూరులో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ….

మెగాస్టార్ చిరంజీవి సినీ రంగంలోనే కాకుండా సామాజిక సేవలో కూడా అగ్రగామిగా నిలిచారని తెలిపారు. ప్రజలకు స్ఫూర్తినిచ్చే నాయకుడిగా ఆయన ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని, చిరంజీవి ఆరోగ్యంగా ఉండి మరెన్నో శుభకార్యాలకు నడిపించాలని ఆకాంక్షించారు.సమాజానికి మార్గదర్శకుడైన ఆయన మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆకాంక్షించారు.

Scroll to Top
Share via
Copy link