మంత్రి లోకేష్‌ను జిల్లాలో ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే రాధాకృష్ణ

పాలకొల్లులో ఆదివారం జరిగిన రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాడు కుమార్తె వివాహ రిసెప్షన్‌ వేడుకలో పాల్గొనేందుకు జిల్లాకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్‌ను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఘన స్వాగతం పలికారు. వేడుకకు హాజరయ్యేందుకు వస్తున్న లోకేష్‌ జిల్లాలో ప్రవేశించగానే లోసరి గ్రామం వద్ద కూటమి నాయకులతో కలిసి రాధాకృష్ణ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పాలకొల్లుకు మంత్రి లోకేష్‌తో పాటు వెళ్లి కాబోయే వధూవరులను ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణతో పాటు మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, పలువరు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link