భారతదేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు …. మన్యాల శ్రీనివాస్

విశాఖపట్నం: ఆగస్టు 16 (కోస్టల్ న్యూస్)

విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం 29వ వార్డ్ లో స్థానిక కలెక్టర్ ఆఫీస్ రావి దుర్గా గణపతి సాయి షణ్ముఖ ప్రసన్న ఆంజనేయ ఆటో స్టాండ్ జెరాక్స్ రమణ దుక్కా ప్రసాద్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న 29వ వార్డ్ జనసేన నాయకులు మన్యాల శ్రీనివాస్ ముందుగా మన్యాల శ్రీనివాస్ ని సాదర స్వాగతం పలికారు, అనంతరం మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసిన నివాళులు అర్పించి అనంతరం బుద్ధిని విగ్రహానికి పాలాభిషేకం చేశారు. జాతీయ గీతాలాపన చేసి స్వతంత్ర సమరయోధులకు ఘనమైన నివాళులు అర్పించి పిల్లలకు మిఠాయిలు మరియు పుస్తక సామాగ్రి చిన్న పిల్లలకు అందజేశారు ఈ సందర్భంగా మన్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ ముందుగా భారతదేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి భారతీయుడి హృద‌యం గ‌ర్వంతో నిండే రోజు అని బానిస సంకెళ్లను తెంచుకున్న రోజు అని మనందరికీ స్వేచ్ఛా వాయువులు పంచిన రోజు ఈరోజు అని స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది యోధులు పోరాడి అసువులు బాసిన వారందరికీ ఘన నివాళులు అర్పించాలి అని వారి త్యాగ ఫలితమే ఈరోజు మనం ఈ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నామని,
వివిధ జాతులు, మతాలు, కులాలు కలిసి ఏకతాటిపై నడిచే అద్భుత దేశం మనది. ఎప్పటికప్పుడు నూతన లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ప్రగతిపథంలో సాగుతున్న మన దేశం, ప్రపంచానికే ఆదర్శం. అణగారిన వర్గాలను అక్కున చేర్చుకుంటూ, తాడితపీడిత ప్రజలకు అండగా నిలుస్తూ, బలహీనులకు ధైర్యాన్నిస్తూ ముందుకు సాగాలనేది పెద్దలు మనకు నేర్పిన పాఠం అని ఇందుకు అనుగుణంగా భవిష్యత్ భావితరాలు అందరూ కూడా స్వాతంత్ర్య దినోత్సవం కోసం తెలుసుకోవాల్సిన అవశ్యకత ఎంత అయిన వుంది అని మరొక్కసారి ప్రజలందరికీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 29వ వార్డ్ కూటమి శ్రేణులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link