శశి వేలివెన్ను లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0 ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు విచ్చేశారు. ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ పాటతో కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా తల్లికి పాదాభివందనం మరియు సత్కారం, ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ముఖ్య అతిధి, ఛైర్మన్ వారి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం జరిగినది. తల్లిదండ్రులు వారి చిన్నారుల విద్యా విషయాల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి అందరినీ ఆలరించారు. ముఖ్య అతిధి శ్రీ బూరుగుపల్లి శేషారావు గారు మాట్లాడుతూ తల్లిదండ్రులు వారి చిన్నారుల పెంపకంపై చాలా జాగ్రత్త వహించాలని, వారు ఏ విషయంలోనైతే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారో అందులో వారిని ప్రోత్సహించాలని, వారిలో నైపుణ్యాభివృద్ధికి తోడ్పడాలని సందేశం ఇచ్చారు. శశి విద్యాసంస్థల చైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ మాట్లాడుతూ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు కలిసి శ్రమిస్తే విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయవచ్చని సందేశమిచ్చారు. విద్యార్థుల తల్లులు మ్యూజికల్ చైర్, తండ్రులు టగ్ ఆఫ్ వార్ వంటి వినోదభరిత ఆటలలో చాలా ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ ఆటలలో విజేతలైన తల్లిదండ్రులకు బహుమతి ప్రదానం జరిగింది. పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు అధ్యాపక బృందానికి భోజన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం లో శశి విద్యా సంస్థల వైస్ చైర్మన్ శ్రీమతి బూరుగుపల్లి లక్ష్మి సుప్రియ, ప్రిన్సిపల్ షేక్ షానూర్ పాల్గొన్నారు.


