తణుకు విద్యుత్ శాఖ సబ్ డివిజన్ ఏ డి ఈ గా దివాకర్ శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈయన రంపచోడవరం రూరల్ సబ్ డివిజన్ నుండి బదిలీలలో భాగంగా తణుకు సబ్ డివిజన్ ఏ డి ఈ గా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా పలువురు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది ఆయనను కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏడిఈ శ్రీనివాస్ ఇటీవల మృతి చెందడంతో ఆయన స్థానంలో దివాకర్ శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు.


