తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ గా డాక్టర్ కాకర్లమూడి సాయికిరణ్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ గా పనిచేసిన డాక్టర్ వెలగల అరుణ ఇటీవల జరిగిన బదిలీలలో భాగంగా తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా విధుల్లో ఉన్న ఆర్థోపెడిషియన్ వైద్యులు డాక్టర్ సాయికిరణ్ తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు


