గత ప్రభుత్వంలో గంజాయిని ప్రోత్సహించిన జగన్‌

గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా చేసిన వైసీపీ ప్రభుత్వం

కూటమి ప్రభుత్వంలో గంజాయిపై ఉక్కుపాదం

తణుకులో అవగాహన ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ

గత వైస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా మార్చిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి గ్రామానికి గంజాయి, డ్రగ్స్‌ పరిచయం చేసిన దుర్మార్గుడు అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరో పించారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో గంజాయి పండించి అక్రమంగా వ్యాపారం చేసి విరివిగా అన్ని గ్రామాలకు గంజాయి సరఫరా చేసే విధంగా వైసీపీ మాఫియా పని చేసిందన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమరవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని తణుకులో గురువారం నిర్వహించిన అవగాహన ర్యాలీను ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. రూ. వేల కోట్లు విలువైన అక్రమ గంజాయి రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు సరఫరా చేశారని దుయ్యబట్టారు. దేశంలో ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్‌ పట్టుబడితే వాటి మూలాలు రాష్ట్రంలో కనిపించేవని విమర్శించారు. అలాంటి పరిస్థితుల నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గంజాయి, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అలాంటి మాఫియాలపై ఉక్కుపాదం మోపే విధంగా అనేక చర్యలు తీసుకున్నారని అన్నారు. గంజాయి, డ్రగ్స్‌ సరఫరా చేసే మాఫియా వెన్నులో వణుకు పుట్టే విధంగా చంద్రబాబు అనేక సంస్కరణలు తీసుకువచ్చినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అ«ధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఎక్కడెక్కడ గంజాయి సాగును అరికట్టి ప్రత్యేక చట్టాలను తీసుకువచ్చి గంజాయి, డ్రగ్స్‌ సరఫరా చేసే వారికి అదే ఆఖరి రోజుగా చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయి వినియోగాన్ని అరికట్టి యువత వినియోగించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. గంజాయి, డ్రగ్స్‌ అరికట్టే విధంగా ప్రజలు ముందుకు రావాలన్నారు. గంజాయి, డ్రగ్స్‌కు సంబంధించి ఎక్కడైనా సమాచారం ఉంటే టోల్‌ఫ్రీ 1972 నెంబర్‌కు ఫోన్‌ చేసి చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు, ఎక్సైజ్‌ శాఖలకు చెందిన అధికారులు, పలు విద్యాసంస్థలకు చెందిన ప్రతినిధులు, విద్యార్థులు, కూటమి నాయకులు, నాయకులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link