భోజనం ఏర్పాట్లకు ఇన్చార్జిగా నియమితులైన రాధాకృష్ణ
ప్రతి టిడిపి కార్యకర్తకు మహానాడు ఓ పండగ అంటూ పేర్కొన్న ఎమ్మెల్యే
ఈనెల 27, 28, 29 తేదీల్లో కడపలో జరగనున్న మహానాడు ఏర్పాటుకు సంబంధించి తనకు అప్పగించిన బాధ్యతలను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చేపట్టారు. మూడు రోజులపాటు జరిగే మహానాడు కార్యక్రమాల్లో విచ్చేసే టిడిపి శ్రేణులు, నాయకులు, కార్యకర్తలకు భోజన ఏర్పాట్లు సంబంధించి ఎమ్మెల్యే రాధాకృష్ణ ఇన్చార్జిగా నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం భోజన ఏర్పాట్లు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు మహానాడు ఒక పండుగ లాంటిదని చెప్పారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా రాయలసీమలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడ్డాగా చెప్పుకునే కడపలో ఈసారి మహానాడు ఏర్పాటు చేయడం మరింత ఉత్సాహాన్ని ఇస్తోందని చెప్పారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో కలిసి సోమవారం మహానాడు ప్రాంగణంలో భోజనం తయారు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాక్ పాయింట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ పరిశీలించారు.


