సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక మారుతి స్కూలు ప్రాంగణముందు సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ తెలుగు మాటకు పాటకు మాధుర్యానికి నిదర్శనం సిరివెన్నెల అని అన్నారు. కవి సాహితీవేత్త ఎర్రంశెట్టి రఘురాం మాట్లాడుతూ సినీ వినీలాకాశంలో అతిపెద్ద తారగా ప్రకాశించిన కాంతిపుంజం సిరివెన్నెల సీతారామశాస్త్రి అని అన్నారు ఈ కార్యక్రమంలో సిరివెన్నెల గీతాలను ఆలపించి సబికులను అలరించారు అనంతరం కవి సాహితి వేత్త ఎర్రం శెట్టి రఘురామును నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చిట్టిడి నాగరాజు, కే .వి .ఎస్ .డి. ప్రసాద్, కర్రీ జానకిరామ్, కమ్మల వెంకటరెడ్డి యశ్వంత్ భరద్వాజ్ వర్మ, సిహెచ్ నరసింహారావు, డి.ఎల్ .ఎన్. శర్మ, వైవి. రాఘవులు, ఎన్. మల్లేశ్వరరావు, ముక్కామల మోహనరావు తదితరులు పాల్గొన్నారు.


