40 రోజుల పాటు కట్టిన ఉపవాస దీక్షలు చేసి ఖురాన్ పఠనం, ప్రార్ధనలతో అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ప్రపంచం సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్ధించిన ముస్లిం సోదరులు నేడు ఈద్-ఉల్-ఫితర్ జరుపుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా ప్రముఖ మహిళా రాజకీయ నాయకురాలు, వ్యాఖ్యత, పగోజిల్లా బిజెపి నాయకులు డాక్టర్ శ్రీమతి ముళ్ళపూడి రేణుక రంజాన్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో పరమత సహనం అనేది అత్యంత ముఖ్యమైనదని పేద కుటుంబాల వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతం కావాలని ఈ రంజాన్ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలియజేశారు.


