రీ సర్వే నూరు శాతం పూర్తి చేయాలని – జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

ఇరగవరం మండలంలోని యర్రాయి చెరువు గ్రామం నందు సర్వే నెంబరు 142 పంట బోధి 350 రైతుల సంబంధించిన వ్యవసాయ భూములకు నీరు అందక దీర్ఘకాలిక సమస్యగా ఉన్నదని పి జి ఆర్ ఎస్ లో రైతులు జిల్లా జాయింట్ కలెక్టర్ దృష్టికి రైతులు తీసుకురాగా తీసుకురాగా సమస్యను పరిష్కరించాలని మండల స్థాయి అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. రైతులు స్థానికంగా నివాసం ఉంటున్న వారితో చర్చించి పరిష్కరించాలని పంట బోదే పరిష్కారానికి చర్యలు చేపట్టి జెసిబి ద్వారా పంట బోధను తవ్వి దీర్ఘకాలికంగా ఉన్న సమస్యను పరిష్కరించటంతో జిల్లా జాయింట్ కలెక్టర్ తీరు రాహుల్ కుమార్ రెడ్డికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఇరగవరం గ్రామంలో సర్వే నెంబరు 406 గ్రామ కంట భూమి లో 70 సెంట్లు వక్స బోర్డు వారికి ఉన్నదని భూమిని నిషేధిత జాబితా నందు వక్స బోర్డు ఆదేశాలు మేరకు గ్రామకంఠం భూమి క్రైమ్ విక్రయాలు నిలుపుదల చేయాలని రెవిన్యూ సదస్సులో కోరగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వక్స్ బోర్డ్ భూమిని సబ్ డివిజన్ చేసి నివేదికను అందజేయాలని తహసిల్దార్ ను ఆదేశించారు. దీర్ఘకాలికంగా ఉన్న వక్స్ బోర్డ్ సమస్యను అధికారులతో చర్చించి పరిష్కారం చేసినందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ పి రాహుల్ కుమార్ రెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఖరీఫ్ సాగులో రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా సకాలంలో గోనే సంచులు అందించి ఆర్ ఎస్ కె లద్వారా ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించడం మరియు రైతులు యొక్క ఖాతాల్లో 48 గంటల లోపు డబ్బులు పడేటట్లు చేసి రైతులకు అన్ని విధాలుగా ఆదు కోవటం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డికి అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రబి సీజన్లో కూడా రైతులుకు అన్ని విధాల సహకరించాలని కోరారు. ఆయన వెంట ఆర్డీవో ఖతీబ్ కౌశల్ భానో, తాసిల్దార్ ఎం సుందరరాజు, మండల సర్వే అధికారులు, వీఆర్వోలు, వీఆర్ఏలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link