తణుకు. రాష్ట్ర న్యాయసేవల సంస్థ గుంటూరు వారి ఉత్తర్వులు మేరకు చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి డి.సత్యవతి మంగళవారం హెల్మెట్ వాడకం పై అవగాహన కల్పిస్తూ ప్రాణరక్షణ కోసం వాహనము నడుపు ప్రతి ఒక్కరు తప్పని సరిగా హెల్మెట్ వినియోగించాలని, ఎంతోమంది మోటారు వాహనాల ప్రమాదాలలో తలకు దెబ్బలు తగులుట వల్ల యెక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని, హెల్మెట్ వాడకం ద్వారా కొంత ప్రాణనష్టం తగ్గించవచ్చని, ప్రతిఒక్కరు హెల్మెట్ వాడకంపై అవగాహన కలిగి ప్రాణాలు కాపాడుకోవాలని, వాహనం వుండి హెల్మెట్ కొనుక్కోలేని వారికి నాల్గవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి సత్యవతి ఆర్థికసహాయంతో హెల్మెట్లు న్యాయవాది గుమస్తాలకు అందచేసారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు శ్రీమతి కే. కృష్ణసత్యలత, సీనియర్ సివిల్ జడ్జి, శ్రీ సాయిరామ్ పోతర్లంక, పి.వి.ఎన్. రంజిత్ కుమార్, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి, పి.ఎస్.పి. చిరంజీవిరావు, స్పెషల్ మెజిస్ట్రేట్ మరియు న్యాయవాదులు, న్యాయవాది గుమస్తాలు పాల్గొన్నారు.


