తణుకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఇరగవరం మండలం ఓగిడి గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న పెన్నాడ రాజు(29) అనే వ్యక్తినీ అరెస్టు చేసి అతని వద్ద నుండి 9 మద్యం సీసాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దాడులలో హెడ్ కానిస్టేబులల్ శ్రీమన్నారాయణ,కానిస్టేబుల్ కె.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.బెల్ట్ షాపులు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని తణుకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్. మణికంఠరెడ్డి తెలిపారు.


