వైసీపీ ప్రభుత్వం అధినేత ముఖ్యమంత్రి జగన్ కుర్చీ దిగిపోయాక,చిలకలూరిపేట వదిలిపెట్టి మాజీ మంత్రి విడదల రజనీ గుంటూరు వెళ్లి అక్కడ కూడా పోటీ చేసి ఓడిపోయాక,నవతరం పార్టీ మద్దత్తు పలికిన NDA కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అనుకున్నట్లుగానే ఇప్పుడు రెండు సంవత్సరాల తరువాత నవతరంపార్టీ జెండా మళ్ళీ ఎగరేసాం అని నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం అన్నారు.
నవతరం పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2025 జనవరి 1న చిలకలూరిపేట రైతు బజార్ రోడ్డులో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద పార్టీ జెండా దిమ్మ పునర్నిర్మాణం చేసి పార్టీ జెండాను అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ఎగురవేశారు. 2022 ఏప్రిల్ 15 వైస్సార్సీపీ గూండాలు విడదల రజనీ అనుచరులు నవతరం పార్టీ జెండా దిమ్మ ధ్వంసం చేసారని,రెండు సంవత్సరాలనుండి పూర్తిగా రజనీ ఓటమి కోరుకుంటూ,జగన్ అరాచక ప్రభుత్వం దిగిపోవాలని నవతరం పార్టీ చేసిన కృషి ఫలించిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని,ఇక్కడ ప్రత్తిపాటి పుల్లారావు అక్కడ చంద్రబాబు అధికారం చేపట్టాలని మేమిచ్చిన మద్దత్తు సత్ఫలితం ఇచ్చిందని రావు సుబ్రహ్మణ్యం అన్నారు.చిలకలూరిపేటలో అరాచకం సాగించిన విడదల రజనీకి ఊతం ఇచ్చిన నీరో చక్రవర్తి జగన్ ప్రభుత్వం ఓటమికి గుర్తు ఈ నవతరం పార్టీ జెండా ఆవిష్కరణ అని అన్నారు.అయితే ఇప్పటికీ జెండా ధ్వంసం చేసి, నవతరం పార్టీ కార్యాలయం పైన ,రావు సుబ్రహ్మణ్యం ఇంటిపైన దాడి చేసిన సూత్రదారి విడదల రజనీని,ఆమె మరిది విడదల గోపి, ఆమె అనుచరులను అరెస్ట్ చేయకపోవడం దారుణం అన్నారు.ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా ఎస్పీ, చిలకలూరిపేట పట్టణ సీఐ లకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రావు స్వాతి,నవతరం పార్టీ మహిళావిభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పిడతలరమాదేవి,ప్రధాన కార్యదర్శి షేక్ షకీలా, చిలకలూరిపేటపట్టణ అధ్యక్షురాలు షేక్ షమ్మీ , విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులు యనమండ్ర కృష్ణ కిషోర్ శర్మ, షేక్ రజాక్, అరేటి లక్ష్మణ, రావు శ్రీకృష్ణదేవరాయలు, నేతలు సానుభూతి పరులు పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం మరియు నూతన సంవత్సరం వేడుకలు సందర్బంగా జెండా ఎగ రవేసి, కేకుకోసి శుభాకాంక్షలు తెలిపారు. పల్నాడు జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలుగా కంచరగుంట సుజాతను నియమించి ఉత్తర్వులు రావు సుబ్రహ్మణ్యం అందించారు.


